ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఈ సంఘటన పాకిస్తాన్ జట్టుకు ఒక చెత్త గణాంకాన్ని జోడించింది. 2025 నుంచి పాకిస్తాన్ ఓపెనర్లు 12 సార్లు సున్నాకి ఔటయ్యారు. ఇది టీ20లలో అత్యధికం. బంగ్లాదేశ్ (8), దక్షిణాఫ్రికా (6) ఈ జాబితాలో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్లు నాలుగు డకౌట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 168 పరుగులు చేసింది. సామ్ అయూబ్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీశాడు.