ఫైనల్‌లోకి అగుగుపెట్టిన ఢిల్లీ.. బెంగళూరుతో ఢీ

2688చూసినవారు
ఫైనల్‌లోకి అగుగుపెట్టిన ఢిల్లీ..  బెంగళూరుతో ఢీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ దశకు చేరుకుంది. బెంగళూరు జట్టు ఇప్పటికే ఫైనల్ చేరగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు గుజరాత్ ను ఓడించి ఫైనల్ కు అర్హత సాధించింది. గురువారం వడోదర వేదికగా జరిగే ఫైనల్ లో బెంగళూరుతో ఢిల్లీ తలపడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుకు చెందిన స్మృతి మంధాన, ఢిల్లీ జట్టుకు చెందిన జెమీమా రోడ్రిగ్స్ ల మధ్య ఉన్న గాఢమైన స్నేహంపై క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు అయినప్పటికీ, ఫైనల్ లో ప్రత్యర్థులుగా ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. స్మృతి ఈ సీజన్ లో 290 పరుగులు చేయగా, జెమీమా 207 పరుగులు చేసింది. వీరి స్నేహబంధాన్ని సహచర ప్లేయర్లు "యిన్ అండ్ యంగ్" అని అభివర్ణిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్