డబ్ల్యూపీఎల్ ఫైనల్లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్స్ లలో జెమీమా రోడ్రిగ్స్(57), వోల్వార్ట్(44) రాణించారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించాలంటే 204 రన్స్ చేయాల్సి ఉంది.