AP: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మరో కీలక నేత ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. విచారణలో ఆ నేత ఎవరనేది జోగి రమేశ్ చెబుతారని, సూత్రధారులు, పాత్రధారులంతా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. నకిలీ మద్యం బాధితులతో తాడేపల్లిలో ధర్నా చేస్తానని బుద్దా వెంకన్న హెచ్చరించారు.