మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ (Xbox)లో భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మంది, అంటే 3,200 మందిని దశలవారీగా తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. తొలి విడతగా 1,600 మందిని వెంటనే తొలగించగా, మిగిలిన కోతలను 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయనుంది. సంస్థ ప్రస్తుత పరిస్థితి బాలేదని, లాభ మార్జిన్లు తక్కువగా ఉన్నాయని ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ పేర్కొన్నారు.