యమహా సంస్థ తమ R15 V4, MT-15 Version 2.0 బైక్‌లలో మాన్‌స్టర్ ఎనర్జీ MotoGP ఎడిషన్‌ను భారత మార్కెట్లో మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. రేసింగ్ లివరీకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ రావడంతో ఈ ప్రత్యేక ఎడిషన్‌లను మళ్లీ విడుదల చేశారు. R15 V4 MotoGP ఎడిషన్ ధర రూ.1,76,050, MT-15 MotoGP ఎడిషన్ ధర రూ.1,77,230. ఈ బైక్‌లలో 155cc ఇంజిన్, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. FZ-S Fi హైబ్రిడ్, FZ-S Fi మోడళ్లకు కూడా కొత్త కలర్ ఆప్షన్‌లను అందించారు.