రావణుడి పాత్రలో యశ్.. నితేశ్ తివారీ వివరణ

5868చూసినవారు
రావణుడి పాత్రలో యశ్.. నితేశ్ తివారీ వివరణ
నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ'లో కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై దర్శకుడు నితేశ్ తివారి మాట్లాడుతూ, రావణుడిని కేవలం భయంకరమైన విలన్‌గా కాకుండా, అతని బలాలు, బలహీనతలు, మేధస్సు, జ్ఞానం, గొప్ప యుద్ధ వీరుడిగా, సంగీత విద్వాంసుడిగా, సమర్థుడైన రాజుగా, శివుడి భక్తుడిగా వివిధ కోణాల్లో చూపించాలనుకుంటున్నట్లు తెలిపారు. అహం, పగతో రగిలిపోతే గొప్ప గుణాలు కూడా పనికిరాకుండా పోయి, రావణుడిలా అంతమైపోతారనే గొప్ప పాఠాన్ని ఈ పాత్ర ద్వారా చెప్పాలనుకుంటున్నట్లు ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్