కృష్ణా జిల్లా గుడివాడలో TDP నేత వేశపోగు ఇమ్మానుయేలుపై YCP నేతలు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. గుడ్‌మేన్ పేట సెంటర్‌లో జరిగిన ఈ ఘటనలో ఇమ్మానుయేలుతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నూతన సంవత్సర వేడుకల్లో YCP నేత రాజేష్‌తో జరిగిన ఘర్షణ దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు.YCP నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఇమ్మానుయేలు ఆరోపించారు. దాదాపు 15 మంది తనపై దాడి చేశారని, YCP నేతలు రాజేష్, ఎలీషా ప్రోత్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆయన తెలిపారు.