ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించిన వైసీపీ శ్రేణులు

51చూసినవారు
ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించిన వైసీపీ శ్రేణులు
AP: నెల్లూరు (D), ముత్తుకూరు (M), కట్టకిందవడ్డిపాలెంలో షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు పాల్పడి, 20 ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్