YCP కుట్రలను తిప్పికొట్టాలి: మంత్రి కొల్లు రవీంద్ర

4843చూసినవారు
YCP కుట్రలను తిప్పికొట్టాలి: మంత్రి కొల్లు రవీంద్ర
AP: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు రాకుండా YCP కుట్ర చేస్తోందని, దీనిని బీసీలు తిప్పికొట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం బీసీల కోసం రూ.35వేల కోట్లు కేటాయించిందని, గతంలో జగన్ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. బీసీలను అణగదొక్కి రాజకీయంగా ఎదగాలనేది జగన్ లక్ష్యమని, బీసీలకు వెన్నుపోటు పొడిచిన జగన్ బీసీ ద్రోహి అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో YCPకి గుణపాఠం చెప్పాలని, బీసీలు ఆర్థికంగా బలపడేలా, వారి భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురానుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్