తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీకి క్లీన్‌చీట్ రాలేదని, ఆ పార్టీ ప్రచారం అసత్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. లడ్డూ పవిత్రత కాపాడేందుకు టీడీపీ నిబంధనలు ప్రవేశపెట్టగా, వైసీపీ వాటిని సడలించి కల్తీకి బీజం వేసిందని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నకు వచ్చిన డబ్బు ఎవరికి వెళ్లిందో తేలాలని, జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ నిర్ధరణ చేసిందని, ఇది సిట్ ఛార్జ్‌షీట్‌లోనూ ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటారని, తిరుమలలో ప్రక్షాళన కొనసాగాలని అన్నారు.