AP: సముద్రంలో బోటు గల్లంతై మరణించిన విశాఖ మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి
వైసీపీ అండగా నిలిచింది. ఆదివారం బాధిత కుటుంబాలను విశాఖ జిల్లా
వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్
జగన్ ప్రకటించిన సహాయం ప్రకారం.. బాధిత కుటుంబాలతో పాటు, మృత్యుంజయుడిగా ప్రాణాలతో తిరిగొచ్చిన చిన్నా కుటుంబానికి కూడా పార్టీ తరఫున రూ.7 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు.