AP: రప్పా రప్పా సంస్కృతిని
వైసీపీ మరోసారి బయటపెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం పాలకొల్లులో అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల హాజరయ్యారు. నిన్న విజయవాడలో టీచర్లపై
వైసీపీ మూక దాడిని ఆయన ఖండించారు. టీచర్లపై గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లతో దాడులు చేయించడం దారుణమన్నారు. విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ పనిచేస్తోందని మండిపడ్డారు.