రాప్తాడులో వైసీపీ అంతర్గత విభేదాలు?

3164చూసినవారు
రాప్తాడులో వైసీపీ అంతర్గత విభేదాలు?
AP: అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర అంతర్గత విభేదాలను ఎదుర్కొంటోంది. సీనియర్ నేత గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబంపై అసంతృప్తితో ఉన్నారు. తోపుదుర్తి బ్రదర్స్ వర్సెస్ గోపాల్ రెడ్డి వర్గాల ఘర్షణలు పార్టీని బలహీనపరుస్తున్నాయి. తోపుదుర్తిపై కేసులు, అంతర్గత కుమ్ములాటలు, కూట‌మి నేత‌ల దూకుడుతో ప్రకాష్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికల్లో పరిటాల సునీత విజయం, ప్రజల్లో వ్యతిరేకత, నాయకుల సమన్వయ లోపం, గ్రూపు రాజకీయాల వల్ల తోపుదుర్తి హ‌వా త‌గ్గిపోయిందని, ఇది స్థానిక ఎన్నికల్లో వైసీపీకి బిగ్ టెస్ట్ కానుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్