AP: సరికొత్త వ్యూహానికి
వైసీపీ పదును పెడుతోంది. సోషల్ మీడియా కోసం జెన్‌జీ టీమ్ సిద్ధం చేయాలని భావిస్తోంది. జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టెక్నాలజీ వినియోగంపై అవగాహన ఉన్న వారిని ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడంతోపాటు కూటమి పార్టీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని అనుకుంటోంది.