వైసీపీ నేతపై కత్తులతో దాడి.. ప్రశ్నిస్తే చంపేస్తారా?: వైసీపీ

12చూసినవారు
వైసీపీ నేతపై కత్తులతో దాడి.. ప్రశ్నిస్తే చంపేస్తారా?: వైసీపీ
AP: నెల్లూరులో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌పై హత్యాయత్నం జరిగిందని ఆ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలానికి చెందిన గోపాల్‌ ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడ్డారని, కత్తులతో దాడి చేశారని వెల్లడించింది. నిన్న ఓ మీడియా సమావేశంలో గోపాల్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారని, అందుకే కక్ష సాధింపు చర్యగా దాడికి దిగారని మండిపడింది. ఇదెక్కడి అరాచకం? ప్రశ్నిస్తే చంపేస్తారా? అని సీఎం చంద్రబాబును నిలదీసింది.

సంబంధిత పోస్ట్