
అఖండ-2 వాయిదాకు అసలు కారణం ఇదేనా?
బాలకృష్ణ అఖండ-2 సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వల్లే విడుదల ఆగిపోయిందని సమాచారం. 14 రీల్స్ సంస్థ నుంచి రూ.28 కోట్లు రావాలని.. అది చెల్లించే దాకా రిలీజ్ ఆపాలని పిటిషన్ వేసింది. మద్రాస్ హైకోర్టు రిలీజ్పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ రెండు నిర్మాణ సంస్థలు కలిసి పని చేసిన సినిమాల విషయంలో ఆర్థిక వివాదమే కారణమైనట్లు తెలుస్తోంది.




