AP: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా వెరిఫికేషన్ పట్ల
వైసీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సూచించారు. సోమవారం విడుదల చేసిన ఒక వీడియోలో, అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తారని, బీఎల్వోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తిరగటం దీనికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.