AP: డీఎస్సీని కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా
వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై రాళ్లు, రాడ్లు, వాటర్ బాటిళ్లతో దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఐదేళ్లు ఉపాధ్యాయ
ఉద్యోగాలు భర్తీ చేయని
జగన్.. ఇప్పుడు డీఎస్సీ గురించి మాట్లాడటం దారుణమన్నారు.