జనసేనలో చేరిన వైసీపీ నేతలు.. ప్రాధాన్యత దక్కక ఆవేదన?

1947చూసినవారు
జనసేనలో చేరిన వైసీపీ నేతలు.. ప్రాధాన్యత దక్కక ఆవేదన?
AP: వైసీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, పెండెం దొరబాబు, కిలారు రోశయ్య వంటి నాయకులు పార్టీ మారిన తర్వాత తమ స్థానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని, తాము ఎందుకు పార్టీ మారామా అని ప్రశ్నించుకుంటున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్