కల్తీ నేయిపై ఫ్లెక్సీలు.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డీజీపీకి వైసీపీ లేఖ

40చూసినవారు
కల్తీ నేయిపై ఫ్లెక్సీలు.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డీజీపీకి వైసీపీ లేఖ
AP: తిరుమల కల్తీ నెయ్యి వివాదం ఏపీ రాజకీయాల్లో మంట పుట్టిస్తోంది. ఈ అంశం మీద నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీకి వైసీపీ లేఖ రాసింది. వైసీపీని, వైసీపీ నేతలను నిందిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని.. అలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఈ ఫ్లెక్సీలు డిజైన్ చేసిన వారి దగ్గర నుంచి ఏర్పాటు చేసిన వారి వరకూ అందరిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలని లేఖలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్