శాసన మండలిలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటన చేస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు దురుసుగా ప్రవర్తించారు. వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు మంత్రిపైకి దూసుకొచ్చారు, ఇతర వైసీపీ సభ్యులు కూడా మద్దతుగా వచ్చారు. దీనికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'తేల్చుకుందాం రండి' అంటూ మాధవరావుకు ఎదురెళ్లారు. కూటమి ఎమ్మెల్సీలు మంత్రి ఆనం వెంట రాగా, మంత్రులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. ఈ ఘటనతో మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది.