ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ YCP చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. ఈ ఉద్యమంలో భాగంగా సేకరించిన కోటికి పైగా సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పించేందుకు నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వైసీపీ భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ముఖ్య నాయకులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేయనున్నారు.