AP: మీడియా ముసుగులో వైసీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచే విధంగా అసభ్యకర రాతలు రాస్తున్నారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తీరుకు నిరసనగా హైదరాబాద్‌లోని ఏబీఎన్ కార్యాలయం ముందు వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా చెత్త రాతలు రాస్తున్న రాధాకృష్ణ, ఏబీఎన్ యాజమాన్యం బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులు చేస్తున్నారని విమర్శించారు.