AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 19న ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించింది. కాలేజీల వద్దకు వెళ్లి పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని తెలిపింది. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.