అమరావతిపై వైసీపీ విధ్వంసకర కుట్రలు చేస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. ఐదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు కమిటీలు అంటూ రైతులను రెచ్చగొడుతున్నారని టీడీపీ ఆరోపించింది. రోడ్లు, భవనాలు, పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయ్యాక రైతుల భూములు వెనక్కి ఇవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నించింది. మాజీ సీఎం జగన్‌కు కనీస అవగాహన ఉందా అని విమర్శించింది. ఇక్కడికి వచ్చి చూస్తే రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుందని పేర్కొంది.