హోం మంత్రి అనితకు సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు పర్యటించనున్న నేపథ్యంలో పెద్ద సవాల్ ఎదురైంది. బల్క్‌డ్రగ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న మత్స్యకారులకు మద్దతుగా వైసీపీ ఈ నెల 22న 'చలో రాజయ్యపేట' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్కడ పర్యటించి మత్సకారులకు మద్దత్తు తెలపనున్నారు. దీంతో ఆమె నియోజకవర్గంలోకి వైసీపీ నాయకుల ఎంట్రీని ఆమె సీరియస్ గానే భావిస్తున్నారు. అలాగని ధర్నాలను అడ్డుకునే పరిస్థితి లేదు. వారిని అడ్డుకోవడం పెద్ద సవాల్‌గా మారింది.