AP: కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. ఒక్క అవకాశమంటూ గతంలో జగన్ అధికారంలోకి వచ్చారని, అనంతరం మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. జగన్ కారణంగా దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు.