AP: వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ మద్దతుతో మరోసారి తేటతెల్లమైందని పేర్కొన్నారు. బీజేపీకి వైసీపీ బీ టీమ్ అని నిజ నిర్ధారణ జరిగిందన్నారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి వైసీపీ మళ్లీ దాసోహం అంటోందని మండిపడ్డారు. ఓటు చోరీతో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదన్నారు.