వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల అభివృద్ధి విషయంలో స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. నాలుగేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి, ఒక్కటి కూడా పూర్తిగా ప్రారంభించలేదని, కేవలం 12% నిధులు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. పీపీపీ మోడల్‌ను వ్యతిరేకించడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని అన్నారు. వైద్య విద్యలో దీర్ఘకాలిక ప్రణాళికలు మొదలయ్యాయని అన్నారు.