వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్

150చూసినవారు
వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్
AP: జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన YCP సోషల్ మీడియా కార్యకర్త అంబోజి వినయ్‌ను కూటమి నేతల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉన్న వినయ్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా YCP
అధ్యక్షులు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట YCP ఇన్‌ఛార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు.

సంబంధిత పోస్ట్