ఆస్తి వివరాలు తెలుపని ఉద్యోగులకు జీతాలు నిలిపివేత: యోగి

3550చూసినవారు
ఆస్తి వివరాలు తెలుపని ఉద్యోగులకు జీతాలు నిలిపివేత: యోగి
ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆస్తి వివరాలు కోరింది. జనవరి 31 లోపు మానవ్ సంపద పోర్టల్‌లో ఆస్తి వివరాలు సమర్పించని 68,236 మంది ఉద్యోగుల జీతాలను యూపీ ప్రభుత్వం నిలిపివేసింది. 1956 ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిలోని 24వ నిబంధన ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. ఆస్తి వివరాలు అందించే వరకు జీతాలు చెల్లించరాదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :