పెరుగు Vs మజ్జిగ.. ఏది బెటర్?

14641చూసినవారు
పెరుగు Vs మజ్జిగ.. ఏది బెటర్?
పెరుగు, మజ్జిగ రెండూ జీర్ణక్రియకు మేలు చేసే ప్రోబయోటిక్స్‌ను కలిగి ఉంటాయి. అయితే వాటి ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12 ఎక్కువగా ఉండి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మజ్జిగలో నీటి శాతం అధికంగా ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, ఎసిడిటీ, గుండెల్లో మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మలబద్ధకానికి పెరుగు, ఎసిడిటీకి మజ్జిగ మంచి ఎంపిక. జీలకర్ర, అల్లం, పుదీనా కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్