హర్మూజ్ జలసంధి విషయంలో మిత్ర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మిత్ర దేశాలకు రెండు మార్గాలే ఉన్నాయని, ఒకటి అమెరికా చమురు కొనడం, మరొకటి ధైర్యంగా హర్మూజ్‌ను దాటి చమురు తెచ్చుకోవడం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు, అమెరికా యుద్ధ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి నిరాకరించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ చర్యలను తాము గుర్తుంచుకుంటామని హెచ్చరించారు.