ఇండక్షన్ స్టవ్ కొనుగోలు చేసే ముందు, దాని వోల్టేజ్, పరిమాణం, ప్రీసెట్ కుకింగ్ మోడ్స్, భద్రతా ఫీచర్లు, పాత్రల ఎంపిక, బడ్జెట్, బ్రాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇన్‌స్టంట్ వంట కోసం 1200W-1500W, రోజువారీ వంట కోసం 1800W-2000W వోల్టేజీ సరిపోతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య, వంటగది స్థలాన్ని బట్టి స్టవ్ సైజును ఎంచుకోవాలి. సాధారణ ఇండక్షన్ కుక్‌టాప్‌లు రూ. 1,500-2,500 వరకు, అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నవి రూ. 5,000 వరకు లభిస్తాయి.