ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాపురం జైపురియా మాల్‌లో ఒక వ్యక్తి మహిళపై కత్తితో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. ఒకరికొకరు తెలిసిన ఆ ఇద్దరి మధ్య జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో నిందితుడు ఆమెపై దాడికి దిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వైరల్ వీడియో ఆధారంగా ఇందిరాపురం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.