లారీ కిందపడి యువకుడు మృతి(వీడియో)

981చూసినవారు
AP: కృష్ణా జిల్లాలోని పామర్రు-గుడివాడ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై ఇద్దరు బాలురు వేగంగా వస్తున్న లారీకి అడ్డుగా వచ్చారు. ఈ క్రమంలో లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ వెనుక కూర్చున్న బి.జగదీశ్(14) అనే బాలుడు లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు. అతడు పామర్రు హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ నడిపిన వెంకటేశ్వరరావు కూడా మైనర్ అని సమాచారం. నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్