పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి తల్లిదండ్రులను చంపిన యువకుడు

13703చూసినవారు
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి తల్లిదండ్రులను చంపిన యువకుడు
ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేయసితో పెళ్లికి ఒప్పుకోలేదని లోకేశ్ అనే యువకుడు ప్రేయసి తల్లిదండ్రులను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఫేస్‌బుక్‌లో హిరాముని అనే యువతికి లోకేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో లోకేశ్ పెళ్లి చేయాలని యువతి తల్లిదండ్రులను చాలా సార్లు కోరాడు. దానికి వారు నిరాకరించడంతో కోపం పెంచుకున్న లోకేశ్ కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్