ఉత్తరప్రదేశ్‌లోని సోన్హా ప్రాంతానికి చెందిన జోగేశ్ అనే యువకుడు, భార్య నుంచి విడాకులు మంజూరు కావడంతో ఆనందంతో 9 కిలోమీటర్లు సాష్టాంగ దండాలు చేశారు. అనంతరం బైడవా సమయ్ మాత ఆలయంలో మొక్కులు తీర్చుకున్నాడు. ఢిల్లీలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న జోగేశ్‌కు 2022లో వివాహం జరిగింది. ఆర్థిక సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి విడాకుల వరకు దారితీశాయి. కోర్టు విడాకులు మంజూరు చేయడంతో, తన కోరిక నెరవేరిందని జోగేశ్ ఈ మొక్కును 12 గంటల సమయంలో పూర్తి చేశాడు.