యూపీలోని కాన్పూర్‌లో పాంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు తన బావమరిదితో ఉన్న సమస్యల కారణంగా తన ఇంటికి నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.