AP: పెళ్లి వేడుకలో ఓ యువకుడు రూ.5 లక్షల నగదు కొట్టేశాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. నాతవరం మండలం శృంగవరం గ్రామంలో జరిగిన పెళ్లిలో రజిని అనే మహిళ వద్ద నుంచి రూ.5 లక్షల నగదును పైల చిట్టిబాబు అనే యువకుడు దొంగతనం చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా గడ్డివాములో దాచిపెట్టినట్లు అంగీకరించాడు. దాంతో దాచిపెట్టిన బ్యాగ్‌ను పోలీసులు బయటకు తీయించారు.