బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజీవ్, అంజలి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి అతడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసి యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు అంజలిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. డిన్నర్‌కు పిలిచి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.