ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం

10579చూసినవారు
యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని ఒక మహిళను ప్రలోభపెట్టి, అత్యాచారం చేసి, నగ్న వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మరణం తర్వాత బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆమెను కమలేష్ అనే వ్యక్తి హోటల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హోటల్ యజమాని జితేంద్రకు అప్పగించాడు. జితేంద్ర ఆమెతో సహజీవనం చేస్తూ, పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రతిరోజూ అత్యాచారం చేశాడని ఆరోపణలున్నాయి. కమలేష్ స్నేహితులు కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్