మీ హీరోలు రారు.. జాగ్రత్త! ఫ్యాన్స్‌కు రజనీకాంత్ హితబోధ

9236చూసినవారు
మీ హీరోలు రారు.. జాగ్రత్త! ఫ్యాన్స్‌కు రజనీకాంత్ హితబోధ
యువత ధోరణిపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా నటులప్రచార కార్యక్రమాల్లో అభిమానులు ప్రాణాలకు తెగించి ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన స్పందించారు. అభిమానుల క్షేమం కోరి, "మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబమే బాధపడుతుంది తప్ప మీ హీరోలు కాదు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది" అని రజనీకాంత్ హితబోధ చేశారు. విద్య, వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. తన తాజా చిత్రం 'కూలీ2' గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్