వికసిత్ భారత్ సాధనలో యువత ముందుండాలి: రాష్ట్రపతి ముర్ము

8750చూసినవారు
వికసిత్ భారత్ సాధనలో యువత ముందుండాలి: రాష్ట్రపతి ముర్ము
AP: విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మందికి బంగారు పతకాలు అందజేశారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ, 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్య యువతకు సాధికారత కల్పిస్తుందని, గిరిజన సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్