దేశాభివృద్ధికి యువత సేవ చేయాలి: వెంకయ్య నాయుడు

2785చూసినవారు
దేశాభివృద్ధికి యువత సేవ చేయాలి: వెంకయ్య నాయుడు
AP: విద్యార్థులు ఉన్నత విద్య తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి దేశాభివృద్ధికి సేవ చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరులోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడుతూ.. చదువు సంస్కారాన్ని నేర్పాలని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని సూచించారు. తన రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. యువత దేశ పురోగతిలో కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్