చిన్నారుల కోసం మొత్తం విమానాన్నే బుక్ చేసిన యూట్యూబర్

9448చూసినవారు
యూట్యూబర్ సౌరవ్ జోషి, ఆయన భార్య అవంతిక ఆర్థికంగా వెనుకబడిన పాఠశాల చిన్నారుల కోసం ఇండిగో విమానాన్ని పూర్తిగా బుక్ చేసి, వారికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించారు. హల్ద్వానీ నుంచి నోయిడా వరకు జరిగిన ఈ ప్రయాణంలో, చిన్నారుల భయాన్ని పోగొట్టి ధైర్యం నింపారు. నోయిడాలో రెస్టారెంట్, గేమింగ్ జోన్‌లకు తీసుకెళ్లి, ఆటలు, పిజ్జాలతో ఆనందంగా గడిపేలా చేసి, సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. ఈ దంపతుల మంచితనాన్ని, చిన్నారుల ముఖాల్లోని చిరునవ్వులను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్