మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు

43చూసినవారు
మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత మహిళా కబడ్డీ జట్టును వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఫైనల్‌లో ఇరాన్‌పై అద్భుత విజయం సాధించి, దేశం గర్వపడేలా చేసిన జట్టును ప్రశంసించారు. సంజూ దేవి అద్భుత ప్రదర్శనతో పాటు, టీమ్ మొత్తం చూపిన ప్రతిభ, పట్టుదల ప్రశంసనీయమని, ప్రతి క్రీడాకారిణి అసాధారణ నైపుణ్యం ప్రదర్శించిందని, పోరాట స్ఫూర్తితో భారత విజయానికి తనవంతు కృషి చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్