AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావ్య రెడ్డి, ఆమె భర్త జీవన్ రెడ్డి తమ కుమారుడు శ్రియాన్ రెడ్డికి, ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట 18వ వార్డ్ మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మి చంద్రిక దంపతులు తమ కుమారుడు ఆర్యన్‌కు అన్నప్రాసన చేయించాలని కోరారు. వారి కోరిక మేరకు వైయస్ జగన్ ఇరు కుటుంబాల చిన్నారులకు అన్నప్రాసన చేసి ఆశీస్సులు అందజేశారు. తమ కుమారుడికి జగన్ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరగడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.