కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

AP: కోనసీమలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జగన్ కోరారు.